టాలీవుడ్ లోకి  నానా పాటేకర్ ఎంట్రీ

25 Mar,2019

అల్లు అర్జున్ చివరికి తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూడో సినిమా పై ఇప్పటికే ఫిలిం వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. అందులో భాగంగానే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. అంతే కాదు ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ గా పూజ హెగ్డే తో పాటు రెండో హీరోయిన్ గా ఈషా రెబ్బ కూడా నటిస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఈ మధ్య బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపడం విశేషం.

Recent News